posted suicide note in facebook

పేస్ బుక్ లో పోస్ట్ చేసి... ఆత్మహత్య

"అయాం సారి ఐ వాన్న డై" అంటూ రక్తంతో రాసిన చిత్రాల్ని పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు ఓ యువకుడు. ఆ పోస్ట్ ని 28 మంది స్నేహితులు లైక్ కొట్టారు. మరుసటి రోజు ఉదయం పేస్ బుక్ లో పోస్ట్ చేసిన మాటల్ని నిజం చేశాడా యువకుడు. ఈ సంఘటన తమిళనాడులోని మదురైలో మంజునాకర వీధిలో చోటు చేసుకుంది. 

18 ఏళ్ల షేక్ మహ్మద్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి కూలి అబుదాహిర్, తల్లి షకీలా భేగం, అతని చెల్లి హజీరాభానులు ఓ రోజు ఇంట్లో లేని సమయంలో క్షమించండి నేను చనిపోతున్నాను. అని రక్తంతో రాసిన ఫోటోలని పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టుని స్నేహితులు లైక్ కూడా చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం షేక్ మహ్మద్ కి స్నేహితులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురి అయ్యారు. కొందరు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించింది. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ విచారణలో కాలేజ్ ఫీజు కట్టలేక షేక్ మహ్మద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ సంఘటనతో షేక్ మహ్మద్ తల్లి దండ్రులు కనీటి పర్యంతం అయ్యారు. అలాగే షేక్ మహ్మద్ పేస్ బుక్ లో అన్ లక్కి ఫెలో అని ట్యాగ్ చేసుకుని ఉండడం ఇంకా భాదని రెట్టింపు చేస్తోంది.

ఇలా ఎందుకు రోజు, రోజుకి బంగారం లాంటి భవిష్యత్ ఉన్న విద్యార్థులు బ్రతకలేక బ్రతుకులు చాలిస్తున్నారు. షేక్ మహ్మద్ లా ఎందరో ఎందుకు ఇలా అవుతున్నారు? ఇలాంటి వారి చావుకి కారణం ఎవరు? ఇలాంటి చావుల్ని ఆత్మా హత్యాలనే అందమా? లేక ఈ సిస్టాన్ని సృస్టించిన సమాజం చేసిన హత్యలు అందామా?

చదువొక్కటే లోకం అనుకున్న షేక్ మహ్మద్ చనిపోయే ముందు తనను కన్నవారు గుర్తుకు రాలేదా?. ప్రాణనష్టం జరిగింది ఈ నష్టానికి కారణం పీజు కట్టలేనని తెలిసి కూడా ఇంజనీరింగ్ చదువుతున్న షేక్ మహ్మద్ దా? లేక అతన్ని చదివిస్తున్న తల్లి,దండ్రులదా? లేక చదివే విద్యార్థులకు చేయూతనివ్వలేని ప్రభుత్వానిదా? ఒక్కసారి మానవత్వపు కోణంలో ఆలోచించండి?. బంగారం లాంటి భవిష్యత్ వున్న విద్యార్థులు నేల రాలకుండా చూడండి. ప్రభుత్వాలు కూడా చదవాలన్న తపన ఉన్న పేద విద్యార్థులకు చేయూతనివ్వాలి.

'పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్ధి చదువు ఆగి పోకూడదు, ఆయువు అర్ధాతరంగా రాలిపోకూడదు'. 





Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment