Email News


హ హ హ 
ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు.
రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. 
భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. 
కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుగా వేరే ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని
ఈ-మెయిల్ ఓపెన్ చేసింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు.
ఆ ఈ-మెయిల్ సారాంశం.
ప్రియమైన భార్యామణీ!
విషయం: నేను చేరుకున్నాను.
తేది:18th October, 2014
నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను. రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ…
నీ భర్త...
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment