ఆంద్రప్రదేశ్ రాజధాని చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు ఆరంభిం చింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా సుమారు 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్‌రోడ్డు రూపు దిద్దుకోనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగు వేల ఎకరాలు అవసరం అవుతాయని ప్రభు త్వం అంచనా వేసింది. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,700 కోట్లు. ఇందులో అధికశాతం మొత్తం భూసేకరణ కోసం ఖర్చు చేయొచ్చని తెలుస్తోంది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు నుంచి కేంద్రం ఆర్థిక సహాయం అందించే అవకా శాలు ఉన్నాయి. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నుంచి కూడా రుణం తీసుకోవచ్చని సమాచారం. పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్దతిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. సిఎం చంద్రబాబు త్వరలో నిర్వహించబోయే జపాన్ పర్యటనలో ఔటర్ రింగ్‌రోడ్డు ముసాయిదా ప్రతిపాదనలను జైకా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు.
0 comments:
Post a Comment